బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు. డీజీపీ జితేందర్ ఆదేశాలు..
హైదరాబాద్, 31 మార్చి (హి.స.) బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈమేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది. ఇందులో ఐజీ ఎం.రమేష్తోపాటు ఎస్ప
డీజీపీ జితేందర్


హైదరాబాద్, 31 మార్చి (హి.స.) బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈమేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది. ఇందులో ఐజీ ఎం.రమేష్తోపాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్లను సభ్యులుగా నియమించారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్పై ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్టతోపాటు సైబరాబాద్ మియాపూర్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ నటులతోపాటు యూట్యూబర్స్, టీవీ యాంకర్లు 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులను కూడా సిట్కు బదిలీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande