విజయవాడ, 31 మార్చి (హి.స.)
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలోని గంగమ్మ ఆలయ కమిటీ( )ని ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్ సహా 11 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌గా బీఎంకే రవిచంద్రను నియమించింది.
తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా బెదిరింపులకు తలొగ్గకుండా కుప్పంలో అన్న క్యాంటీన్‌ను రవిచంద్ర నిర్వహించారు. తన నియోజకవర్గంలోని ఆలయం కావడంతో గంగమ్మ కమిటీని చంద్రబాబు స్వయంగా ఎంపిక చేశారు. ఆలయ పవిత్రత, ప్రతిష్ఠ పెంచేలా కమిటీ చర్యలు ఉండాలని సీఎం భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల