విజయవాడ, 31 మార్చి (హి.స.) భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరు జిల్లా జైలులోని మహిళా బ్యారక్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసుబాబుపై ఈ నెల 17న రాత్రి దాడి జరిగింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బోసుబాబు భార్య శాంతకుమారి, ఆమె ప్రియుడు సొంగా గోపాలరావు ఈ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి 24న న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇద్దరిని జిల్లా జైలుకు తరలించారు. శాంతకుమారి(31)ని మహిళా బ్యారక్‌లో ఉంచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల