ఏ.పీ, బాపట్ల. 31 మార్చి (హి.స.)
త్వరలో కేజీ నుంచి పీజీ వరకు
విద్యా విధానంలో మార్పులు చేస్తున్నాం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు సత్యప్రసాద్, సత్యకుమార్ ఈ రోజు పర్యటించారు. రేపల్లె ఆర్టీసీ డిపోలో 10 నూతన ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ లను సత్య కుమార్ యాదవ్, చైర్మన్ కొనకళ్ల నారాయణతో కలిసి ప్రారంభించారు. తర్వాత చాట్రగడ్డలో శ్రీ సరస్వతి విద్యామందిర్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..