హైదరాబాద్, 31 మార్చి (హి.స.) హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ కార్యాలయం అధికారులు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల విషయంలో HCA బెదిరించిందో లేదో అనే అంశంపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశాన్ని విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరికలు చేసారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..