విజయవాడ, 31 మార్చి (హి.స.)
విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా సహాయ సిబ్బంది లేరు. రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రి ఓపీతో కిక్కిరిసిపోతుంది. ప్రస్తుతం రోజుకు ఓపీ 2500 మంది వరకు ఉంటోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రోగులు వివిధ వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తున్నారు. అందులో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధ పడేవారే అధికంగా ఉంటున్నారు. ప్రాంతీయ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు కూడా ఇక్కడికి రోగులను పంపిస్తున్నారు. రద్దీకి తగ్గట్టు సిబ్బంది లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల