హైదరాబాద్, 1 ఏప్రిల్ (హి.స.)
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ పక్క ఇంట్లో ఉంటున్న ఒక మైనర్ బాలికను, ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో గదిలో బంధించి, ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన Cr.NO 146/2023 కేసులో నిందితుడు కాసర్ల మహేష్ @ బన్నీ s/o నాగయ్య @ నాగరాజు, వయస్సు: 19 సంవత్సరాలు వృత్తి: లేబర్ R/o ద్వారకపురం, చైతన్యపురి N/o కరివిరాల కొత్తగూడెం (v) తుంగతుర్తి (m) సూర్యాపేట జిల్లా వాసిని దోషిగా నిర్ధారించడం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో U/S 376(AB), 376(2)(f) 324 IPC & section 5&6 ఆఫ్ పోక్సో చట్టం మరియు చైతన్యపురి స్టేషన్ SC NO 241/2023, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం ఎల్.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి గారు ఈ రోజు అనగా 01/04/2025 తేదీన నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.5,000/- జరిమానా విధించబడింది* మరియు *బాధితురాలికి రూ.5,00,000/- పరిహారం అందించబడింది.* ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీమతి సునీత గారు మరియు డి.రఘు గారు వాదనలు వినిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు