ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్
తెలంగాణ, మెదక్. 1 ఏప్రిల్ (హి.స.) ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలను కల్పించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం నాడు ఆయన మనోహరాబాద్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక పర్యటన చేశారు. ఓపీ, ల్యాబ్ డ
మెదక్ జిల్లా కలెక్టర్


తెలంగాణ, మెదక్. 1 ఏప్రిల్ (హి.స.)

ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు మెరుగైన

వైద్య సేవలను కల్పించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం నాడు ఆయన మనోహరాబాద్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక పర్యటన చేశారు. ఓపీ, ల్యాబ్ డెలివరీ రూమ్ పనులను పరిశీలించారు. వార్డులో తిరిగి ప్రత్యక్షంగా రోగులతో మాట్లాడారు. క్షయ రోగస్థులకు పోషణ కిట్ ఇస్తున్నారా లేదా తెలుసుకున్నారు. అనంతరం హాజరు పట్టికను పరిశీలించి మెరుగైన సేవలను కల్పించాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande