తెలంగాణ, నిజామాబాద్. 1 ఏప్రిల్ (హి.స.)
నిజామాబాద్ జిల్లాలో ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిగిన 4,02,154 కుటుంబాలకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. జిల్లాలో 3,80,222 కుటుంబాలు ఆహార భద్రత కార్డులు ఉండగా, వాటి పరిధిలోని 12,50,996 మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 7505.856 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గల 759 ప్రజా పంపిణీ కేంద్రాల (రేషన్ దుకాణాల) ద్వారా కార్డు దారులందరికీ నిర్దేశిత కోటా మేరకు సన్న బియ్యం పంపిణీ జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు