సిద్ధిపేట, 1 ఏప్రిల్ (హి.స.) జిల్లా
హుస్నాబాద్ నియోజకవర్గంలో పోతారం (ఎస్) లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సేర్ఫ్ ఆధ్వర్యంలో
వరి ధాన్యం తేమ శాతం ను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు
అనంతరం హమాలీ లతో, మహిళలతో ముచ్చటించారు..
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ,అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ,హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పిఏసి చైర్మన్ శివయ్య ఇతర నాయకులు,వ్యవసాయ శాఖ అధికారులుపాల్గొనారు
తూకంలో మోసం లేకుండా డబ్బుల పేమెంట్ విషయంలో కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం
గతంలో ఓ ఆసామి మా గ్రామంలో ధాన్యం కొనుగోలు చేసుకుని పోయాడు డబ్బులు ఇవ్వలేదని నా దగ్గరికి వచ్చారు
అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వమే మీ దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తుంది
రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం
పంట రాకపోతే కొనుగోలు కేంద్రాలు కొన్ని ప్రాంతాలు ఆలస్యం అవుతున్నాయి
రాష్ట్రవ్యాప్తంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కు వచ్చేల నిర్ణయం తీసుకుంటుంది
సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాం
అగ్రికల్చరల్ పనిముట్లు మండల సమైక్యాల ద్వారా వచ్చేలా రైతులకు ఉపయోగపడేలా చేస్తున్నాం
అనేక కార్యక్రమాల్లో మన మహిళలు ముందు ఉంటున్నారు
మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లు, ఇలా సమైక్య సంఘాల ద్వారా 600 ఆర్టిసి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ తీసుకుంటుంది
ప్రభుత్వం అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్య తెలుస్తుంది
ఇందిరమ్మ ఇళ్ల సర్వే గ్రామాల్లో జరుగుతుంది అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వస్తాయి
ఫేస్ -1ఫేస్ -2 కింద ఇల్లు మొత్తం లేనివారికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే విధంగా గ్రామం లోని నిర్ణయం తీసుకోవాలి
ఈరోజు నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్న రైతులకు ఉద్యోగులకు మహిళలకు సంక్షేమ పథకాలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం
అక్క చెల్లెలు ఆశీర్వాదం ప్రభుత్వానికి ఇచ్చి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోయేలా ఆశీర్వదించండి
వడ్ల తూకం విషయంలో ఎక్కడ కూడా అదనంగా తూకం చేయడం లేదు.. ఎక్కడైనా అధనం తూకం వేస్తే చర్యలు ఉంటాయి
రైతులందరికీ శుభాకాంక్షలు
గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు త్వరగా పూర్తిచేసి పంటలకు నీళ్లు అందిస్తాం.. రైతులకు ఇబ్బంది అయినా అందరూ సహకరించండి
త్వరలోనే నీళ్లు తీసుకువచ్చే బాధ్యత మాది
అని పొన్నం అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు