సికింద్రాబాద్ సీతాఫలమండీలో డాక్టర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ కొత్త విగ్రహాలన ఏర్పాటు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
హైదరాబాద్, 1 ఏప్రిల్ (హి.స.) సికింద్రాబాద్ నగరంలోని సీతాఫలమండీలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ల కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫలమండీ
ఎమ్మెల్యే పద్మారావు గౌడ్


హైదరాబాద్, 1 ఏప్రిల్ (హి.స.) సికింద్రాబాద్ నగరంలోని

సీతాఫలమండీలో డాక్టర్ బాబా

సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ల కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫలమండీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు గరికపాటి చంద్రశేఖర్ నేతృత్వంలోని కొత్త కమిటీ ప్రతినిధులు పద్మారావు గౌడ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహనీయుల స్ఫూర్తి ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. అణగారిన వర్గాల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, తమ ప్రయత్నాలు అందరికి చేర్చడంలో సహకరించాలని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande