కర్నూలు ,, 19 ఏప్రిల్ (హి.స.)
: కర్నూలుకు చెందిన డాక్టర్ జీవీ సందీప్ చక్రవర్తి శ్రీనగర్ ఎస్‌ఎస్పీగా నియమితులయ్యారు. విశ్రాంత వైద్యులైన రామగోపాల్‌రావు, రంగమ్మ దంపతుల కుమారుడైన డా.సందీప్ చక్రవర్తి కర్నూలు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2013లో సివిల్స్ రాసి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం కేంద్రం హోంశాఖ జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి కేటాయించింది. ఆయన ఆ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసి ఉత్తమ సేవలందించారు. శ్రీనగర్ ఎస్‌ఎస్పీగా సందీప్ చక్రవర్తి నియమితులవడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల