ఢిల్లీ - 19 ఏప్రిల్ (హి.స.)దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. పట్టపగలే మేఘావృతం అయింది. అంతేకాకుండా గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తం అయింది. ఈ మేరకు ప్రయాణికులను హెచ్చరించారు. గాలి మార్పుల కారణంగా శుక్రవారం విమానాలు 4 గంటలు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది. పరిస్థితులను బట్టి ఎయిర్ ట్రాఫిక్ ఫ్లోలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తు్న్నాయని.. దయచేసి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని ఎయిర్‌పోర్టు సంస్థ కోరింది. ప్రయాణికులు విమాన సంస్థలతో టచ్‌లో ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు