రక్తదానాలకు సిద్ధంగా ఉండండి… ఫెమా పిలుపు
న్యూఢిల్లీ, 9 మే (హి.స.) పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాలు పరస్పరం దాడుల చేసుకుంటున్నాయి.. ఈ క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఫెమా) దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలకు పిలుపునిచ్చింది. వైద్యులు, వైద్య సంస్
రక్తదానం


న్యూఢిల్లీ, 9 మే (హి.స.)

పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాలు పరస్పరం దాడుల చేసుకుంటున్నాయి.. ఈ క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఫెమా) దేశవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలకు పిలుపునిచ్చింది. వైద్యులు, వైద్య సంస్థలు, ఇతర సామాజిక సంస్థలు వెంటనే రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించింది.ముందు జాగ్రత్త చర్యగా రక్త నిల్వలు అధికంగా ఉండేలా చూడాలని కోరింది.. అలాగే ప్రతి ఒక్కరు స్వచ్చదంగా రక్తదానం చేయాని కోరింది. ప్రతి బ్లడ్ బ్యాంక్ 24 గంటల సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొంది.. ప్రతి ప్రభుత్వ హాస్పటల్లో ఖచ్చింతంగా బ్లడ్ బ్యాంకులు ఉండేలా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరింది..

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande