సూళ్లూరుపేట, 21 ఏప్రిల్ (హి.స.)రాకెట్ ప్రయోగాలకు ఉపయోగించే ధ్రవ ఇంధనం సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్‌కు ఆదివారం భారీ భద్రత నడుమ చేరింది. తమిళనాడులోని ఇస్రో సెంటర్ మహేంద్రగిరి నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో శ్రీహరికోటకు తీసుకొచ్చారు. వచ్చే నెలలో షార్ నుంచి ప్రయోగించే జీఎ్‌సఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ అనుసంధాన పనులు ఇప్పటికే వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ (వ్యాబ్)లో చురుగ్గా సాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల