‘నిందలేస్తే సరికాదు.. ఆధారాలు చూపండి..’ పహల్గాం దాడిపై పాకిస్థాన్ రియాక్షన్‌ ఇదే!
ఇస్లామాబాద్, 24 ఏప్రిల్ (హి.స.)భారత్‌ ప్రతీకార చర్యలకు ఉపక్రమించిన తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం జాతీయ భద్రతా కమిటీ (NSC) ఠంచన్ గా ఎమర్జెన్సీ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. IWTని నిలిపివేయడం, వాఘా-అట్టారి సరిహద్దును మూసివేయడం, పాకి
Pakistan PM calls emergency NSC meeting after India's suspension of Indus Waters Treaty


ఇస్లామాబాద్, 24 ఏప్రిల్ (హి.స.)భారత్‌ ప్రతీకార చర్యలకు ఉపక్రమించిన తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం జాతీయ భద్రతా కమిటీ (NSC) ఠంచన్ గా ఎమర్జెన్సీ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. IWTని నిలిపివేయడం, వాఘా-అట్టారి సరిహద్దును మూసివేయడం, పాకిస్తానీయులకు వీసాలను రద్దు చేయడం వంటి భారత్‌ వరుస కఠిన చర్యలను పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ తీవ్రంగా విమర్శించారు.

భారత్ నిర్ణయాలు తీవ్రమైనవి, అనుచితమైనవిగా పేర్కొన్నారు. భారత్‌లో జరిగిన ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్‌కు సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలను భారత్‌ సమర్పించలేదు. ఆధారాలను సేకరించడంలోనూ విఫలమైంది.

కేవలం కోపావేశంలోనే స్పందించినట్లు తెలుస్తోంది. భారత్‌ ప్రకటనలు తీవ్రత లోపాన్ని ప్రతిబింబిస్తుందని దార్ అన్నారు. అంతేకాకుండా భారత్ సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా పాకిస్తాన్‌పై నిందలు వేస్తుందని, ఉగ్రవాదులపై కోపాన్ని పాక్‌పై వెళ్లగక్కడం సముచితం కాదని అన్నారు. కేవలం ఆరోపణలు కాకుండా ఆధారాలు సమర్పించాలని ఇషాక్ దార్ కోరారు. భారత్‌ చర్యలకు పాకిస్తాన్ తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేస్తున్నట్లు భారత్‌ ప్రకటించడాన్ని పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవాయిస్ లెఘారీ.. నిర్లక్ష్య చర్య, చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande