ముంబై, 24 ఏప్రిల్ (హి.స.) గోల్డ్ రేట్లు ఒక్కసారిగా దిగివచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అందుకు కారణంగా చెప్పవచ్చు. చైనాపై టారిఫ్‌లు తగ్గిస్తామన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో బంగారం పెట్టుబడులపై మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా దిగివచచాచి. క్రితం రోజు వరకు ఔన్స్ గోల్డ్ రేటు 3500 డాలర్ల పైన ఉండగా.. ఇవాళ ఆసియా బులియన్ మార్కెట్లో గోల్డ్ రేటు ఏకంగా 3 శాతం మేర పడిపోయింది. దీంతో దేశీయ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 24వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
రూ.3000 తగ్గిన బంగారం ధర..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే తులంపై రూ.3000 తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 98 వేల 350 వద్దకు దిగివచ్చింది. అంతకు ముందు రోజు లక్ష మార్క్ చేరిన సంగతి తెలిసిందే. రికార్డ్ గరిష్ఠాల నుంచి వెనక్కి వస్తుండడం భారీ ఊరటగా చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులంపై రూ.2750 తగ్గింది. దీంతో తులం ధర రూ.90 వేల 150 వద్దకు పడిపోయింది.
స్థిరంగా వెండి రేటు..
బంగారం ధరలు భారీగా దిగివచ్చినప్పటికీ వెండి ధర మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం కిలో వెండి రేటు రూ.1000 పెరిగగా ఆ తర్వాత స్థిరంగానే ఉంది. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 1,11,000 వద్ద ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి