పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..
న్యూ ఢిల్లీ, 26 ఏప్రిల్ (హి.స.) బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఆల్‌టైమ్‌ హైకి ఎగబాకి.. లక్ష మార్కుకు చేరువైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి.. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో స్వచ్ఛమై
GOLD


న్యూ ఢిల్లీ, 26 ఏప్రిల్ (హి.స.)

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఆల్‌టైమ్‌ హైకి ఎగబాకి.. లక్ష మార్కుకు చేరువైన విషయం తెలిసిందే. ఆ తర్వాత గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి.. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో స్వచ్ఛమైన పసిడి ధర 98వేలుగా ఉంది. తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 26 ఏప్రిల్ 2025 శనివారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,040, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.98,230 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,00,800 లుగా ఉంది. కాగా.. దేశియంగా బంగారం పది గ్రాములపై దాదాపు రూ.10 మేర, వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇంకా ప్రతిరోజూ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,040, 24 క్యారెట్ల ధర రూ.98,230 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande