హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.)
భారత్ సమ్మిట్ లో భాగంగా నేడు జరగాల్సిన పలు కార్యక్రమాలు రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్రం ఈరోజు సంతాప దినంగా ప్రకటించడంతో కార్యక్రమాలు వాయిదా వేశారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన హైదరాబాద్ డిక్లరేషన్ సైతం రేపటికి వాయిదా పడింది. శుక్రవారం సాయంత్రం ట్యాంక్బండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగబోయే క్యాండిల్ ర్యాలీలో విదేశీ ప్రతినిధులు సైతం పాల్గొననున్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరయినట్లు తెలిపారు.
అయితే.. కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్సమ్మిట్లో తెలంగాణ కల్చర్తో ఆర్భాటంగా ఆహ్వానం పలుకేందుకు రూపొదించుకున్న కార్యక్రమాలన్నీ రద్దు చేసినట్లు తెలిపారు. ఈ సమయం సెలబ్రేషన్స్ చేసుకునేది కాదని అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్