ఉగ్రవాది దాడిలో గాయపడిన వారికి ఉచిత.చికిత్స అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్.అంబానీ తెలిపారు
ముంబయి, 25 ఏప్రిల్ (హి.స.)జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌, ఎండీ ముకేశ్‌ అంబానీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన రిలయన్స్‌ తరఫున తన ప్రగాఢ
ఉగ్రవాది దాడిలో గాయపడిన వారికి ఉచిత.చికిత్స అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్.అంబానీ తెలిపారు


ముంబయి, 25 ఏప్రిల్ (హి.స.)జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌, ఎండీ ముకేశ్‌ అంబానీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన రిలయన్స్‌ తరఫున తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అలాగే, ఉగ్రదాడిలో గాయపడిన వారికి ముంబయిలోని రిలయన్స్‌ ఫౌండేషన్‌కు చెందిన సర్‌ హెచ్‌ఎన్‌ హాస్పిటల్‌లో ఉచితంగా చికిత్స అందిస్తామని ఈ సందర్భంగా ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ఉగ్రవాదం మానవాళికే మచ్చ అని, అది ఏ రూపంలో ఉన్నా సహించరాదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రధాని మోదీ, భారత ప్రభుత్వానికి రిలయన్స్‌ అండగా ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande