కన్నడ నటి రన్యారావు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
బెంగళూరు:, 26 ఏప్రిల్ (హి.స.) అక్రమ బంగారం తరలించిన కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు (Ranya Rao) ఎదురుదెబ్బ తగిలింది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రన్యారావు, మరో నిందితుడు తరుణ్‌ కొండూరు రాజు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇప్పటికే తీర్పు రిజర్వ
కన్నడ నటి రన్యారావు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.


బెంగళూరు:, 26 ఏప్రిల్ (హి.స.) అక్రమ బంగారం తరలించిన కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు (Ranya Rao) ఎదురుదెబ్బ తగిలింది. తమకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రన్యారావు, మరో నిందితుడు తరుణ్‌ కొండూరు రాజు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసిన కర్ణాటక హైకోర్టు తాజాగా దానిని కొట్టివేసింది. దీంతో కాఫిఫోసా చట్టం కింద వారికి ఏడాది పాటు బెయిలు లభించదని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో రన్యారావుకు బెయిలు ఇవ్వకూడదని డీఆర్‌ఐ అధికారులు న్యాయస్థానంలో వాదనలు వినిపించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.విశ్వనాథ్‌ శెట్టి నిందితుల పిటిషన్‌ను తోసిపుచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande