ప్రపంచవ్యాప్తంగా విపక్షాలు అనచివేతకు గురవుతున్నాయి.. రాహుల్ గాంధీ
హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.) హైదరాబాద్లోని హెచ్ఐసీసి వేదికగా జరుగుతోన్న భారత్ సమ్మిట్- 2025 సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ సమ్మిట్కు తాను నిన్ననే రావాల్సి ఉండే.. కానీ, కశ్మీర్కు వెళ్లాను..
రాహుల్ గాంధీ


హైదరాబాద్, 26 ఏప్రిల్ (హి.స.)

హైదరాబాద్లోని హెచ్ఐసీసి వేదికగా జరుగుతోన్న భారత్ సమ్మిట్- 2025 సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ సమ్మిట్కు తాను నిన్ననే రావాల్సి ఉండే.. కానీ, కశ్మీర్కు వెళ్లాను.. క్షమించండి అని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. రాజకీయాల్లో కొత్త జనరేషన్ రావాలని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని అన్నారు. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమే కొనసాగుతోందని అన్నారు. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదని అన్నారు.

ఇక్కడే కాదు.. విపక్ష పార్టీలు ప్రపంచ వ్యాప్తంగా అణిచివేతకు గురవుతున్నాయని చెప్పుకొచ్చారు. విపక్షాల వాదన వినేందుకు కొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన చెందారు. దేశంలో మహిళలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని.. ఇప్పుడా సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గాలు వెతుక్కుంటున్నారని అన్నారు. నాయకులు కూడా ప్రజలు చూపించిన మార్గాల్లోనే వెళ్లాలని సూచించారు. విద్వేశ రాజకీయాలు చేయకుండా.. ప్రజలకు ప్రేమను పంచాలని పిలుపునిచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande