రక్షణ శాఖ కార్యకలాపాలపై మీడియా ఛానళ్లకు కేంద్రం కీలక ఆదేశాలు.
న్యూఢిల్లీ, 26 ఏప్రిల్ (హి.స.) ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కశ్మీర్ ఘటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆర్మీకి సంబంధించిన వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఢిఫెన్స్ ఆపరేషన్స్ సైతం లైవ్ టెలికాస్ట్ చ
కీలక ఆదేశాలు


న్యూఢిల్లీ, 26 ఏప్రిల్ (హి.స.)

ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధ

వాతావరణం కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక కశ్మీర్ ఘటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆర్మీకి సంబంధించిన వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఢిఫెన్స్ ఆపరేషన్స్ సైతం లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ అన్ని మీడియా ఛానళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణశాఖ కార్యలాపాలు, భద్రతా బలగాల కదలికలను లైవ్ టెలికాస్ట్ చేయవద్దని ఆదేశించింది. అలా చేయడం వల్ల డిఫెన్స్ ఆపరేషన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన వార్తలను షేర్ చేయవద్దని కోరింది. భద్రతకు సంబంధించిన కీలక అంశాలు లీక్ అయ్యే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande