న్యూఢిల్లీ, 26 ఏప్రిల్ (హి.స.) దేశ
రాజధాని ఢిల్లీ శివారులో ఘోర ప్రమాద సంఘటన జరిగింది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో హర్యానాలోని ఫిరోజపూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్ చేస్తున్నారు.
కాగా, ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. వ్యాన్ డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు పారిశుద్ధ్య సిబ్బంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన పారిశుద్ధ్య కార్మికుల్లో ఐదుగురు ఖేరీ కలాన్ గ్రామానికి చెందినవారని, ఒకరు జిమ్రావత్ గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీస్ అధికారి తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..