ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన పూణే కోర్ట్..
మహారాష్ట్ర, పూణే, 26 ఏప్రిల్ (హి.స.) వీర సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పూణే కోర్ట్ సమన్లు జారీ చేసింది. లండన్ పర్యటన సందర్భంగా సావర్కర్ ఈ చేసిన వ్యాఖ్యలపై
రాహుల్ గాంధీ


మహారాష్ట్ర, పూణే, 26 ఏప్రిల్ (హి.స.) వీర సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పూణే కోర్ట్ సమన్లు జారీ చేసింది. లండన్ పర్యటన సందర్భంగా సావర్కర్ ఈ చేసిన వ్యాఖ్యలపై ఆయన బంధువు ఒకరు కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాహుల్కు సమన్లు పంపింది. మే 9న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

మరోవైపు సావర్కర్పై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande