ఐదేళ్ల తర్వాత పున:ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర్ యాత్ర
న్యూఢిల్లీ, 26 ఏప్రిల్ (హి.స.) కరోనా కారణంగా కైలాస పర్వతం, మానస సరోవర్ సరస్సు పర్యటనలను 2020లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర పున:ప్రారంభం కానుంది. జూన్ 30వ తేదీ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకట
కైలాస మానస సరోవర్ యాత్ర


న్యూఢిల్లీ, 26 ఏప్రిల్ (హి.స.)

కరోనా కారణంగా కైలాస పర్వతం,

మానస సరోవర్ సరస్సు పర్యటనలను 2020లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర పున:ప్రారంభం కానుంది. జూన్ 30వ తేదీ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆగస్టు వరకు ఈ యాత్ర కొనసాగనుందని వెల్లడించింది. మొత్తం 5 గ్రూపులు కైలాస యాత్రకు అధికారులు అనుమతిస్తారు. ఒక్కొ గ్రూపులో 50 మంది ఉంటారని వెల్లడించారు. మొదటి బృందం జూలై 10న లిపులేఖ్ పాస్ ద్వారా చైనాలో ప్రవేశిస్తుంది. చివరి బృందం ఆగస్టు 22న తిరిగి వస్తుంది.

ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రతిబృందం టనక్పుర, ధార్చులాలో ఒక్కొక్క రాత్రి, గుంజీ, నభిదాంగ్లో రెండు రాత్రులు బస చేసిన తర్వాత చైనాలోకి ప్రవేశిస్తుంది. కైలాస యాత్ర తర్వాత తిరిగి చైనా నుంచి బయలుదేరి బుండి, చౌకోరి, అల్మోరాలో ఒక రాత్రి బస చేసిన తర్వాత ఢిల్లీకి చేరుకుంటుంది. మొత్తం యాత్ర పూర్తవడానికి ఒక్కొ బృందానికి 22 రోజుల సమయం పడుతుంది. కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లే భక్తులకు ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్లోని గుంజిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande