శిమ్లా:, 26 ఏప్రిల్ (హి.స.) నవభారత చరిత్రలో 1972 నాటి శిమ్లా ఒప్పందానిది ప్రముఖ స్థానం. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్‌లోని కీర్తి హాలులో ఒక టేబుల్‌పై ఈ ఒప్పందానికి సంబంధించిన సంతకాలు జరిగాయి. ఒప్పందం చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా ఈ టేబుల్‌పై భారత్, పాకిస్థాన్‌ల పతాకాలను ఏర్పాటు చేశారు. టేబుల్ పక్కనే ఉన్న గోడకు ఒప్పందంపై సంతకాలు జరుగుతున్నప్పటి ఫొటో కూడా తగిలించి ఉంచారు. పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్పికర్ అలీ భుట్టో ఒప్పందంపై సంతకం చేస్తుండగా తీసిన ఈ ఫొటోలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాల్లో భాగంగా శిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు