తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 25 ఏప్రిల్ (హి.స.)
వరి ధాన్యం కొనుగోలులో వేగం
పెంచాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులతో కొనుగోలు ప్రక్రియ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంట కొనుగోలులో వేగం పెంచాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలింపు నిమిత్తం లారీలను కేటాయించామని తెలిపారు. ధాన్యం తరలించడానికి వాహనాల కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు