కామారెడ్డి జిల్లా పోలీస్ బాస్ రాజేష్ చంద్ర దూకుడు.. ఆకస్మికత నిఖీలతో హడల్..
తెలంగాణ, కామారెడ్డి. 25 ఏప్రిల్ (హి.స.) జిల్లా పోలీస్ బాస్ రాజేష్ చంద్ర బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఆకస్మిక తనిఖీలు చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న హోం గార్డు నుంచి ఎస్సైల వరకు సస్పెన్షన్ల
కామారెడ్డి ఎస్పీ


తెలంగాణ, కామారెడ్డి. 25 ఏప్రిల్ (హి.స.)

జిల్లా పోలీస్ బాస్ రాజేష్ చంద్ర

బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఆకస్మిక తనిఖీలు చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న హోం గార్డు నుంచి ఎస్సైల వరకు సస్పెన్షన్లు చేస్తూ విధుల్లో అలసత్వం వహిస్తున్న వారి గుండెలను హడలెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు జుక్కల్, తాడ్వాయి, రామారెడ్డి ఎస్సైలతో పాటు కానిస్టేబుల్, హోం గార్డు లను సస్పెండ్ చేసి తన మార్కును చాటుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సూటిగానే మెసేజ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు వివిధ కారణాలతో వచ్చే ఫిర్యాదు దారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఫిర్యాదులను స్వీకరించడంతో అలక్ష్యం చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెప్పినట్లుగానే చేస్తూ పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. విధి నిర్వహణలో ఎంతటి వారైనా సహించేది లేదంటూ అంటూ హెచ్చరికలు చేస్తూ దూసుకుపోతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande