ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం..
హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.) ప్రముఖ సైంటిస్ట్, ఇస్రో మాజీ చైర్మన్ డా. కే. కస్తూరి రంగన్ మృతి పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగ
కిషన్ రెడ్డి సంతాపం..


హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.)

ప్రముఖ సైంటిస్ట్, ఇస్రో మాజీ చైర్మన్ డా. కే. కస్తూరి రంగన్ మృతి పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. కస్తూరి రంగన్ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.

అలాగే డాక్టర్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ.. భారతీయతను ప్రతిబింబిస్తూ, భవిష్యత్ భారతానికి పునాదులు వేసేలా.. నూతన జాతీయ విద్యావిధానం రూపొందించిందని తెలిపారు. అంతేగాక భారతదేశ అంతరిక్ష రంగంతోపాటుగా.. విద్యారంగంలో సంస్కరణల కోసం వారు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఇక వారి జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ.. ఓం శాంతి అని రాసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande