నర్మదా బచావో ఆందోళన్' ఉద్యమకారిణి, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.) ‘నర్మదా బచావో ఆందోళన్' ఉద్యమకారిణి, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ను ఇవాళ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పెట్టిన పరువు నష్టం కేసులో ప్రొబేషన్ బాండ్లన
మేధా పాట్కర్ను అరెస్టు


న్యూఢిల్లీ, 25 ఏప్రిల్ (హి.స.)

‘నర్మదా బచావో ఆందోళన్'

ఉద్యమకారిణి, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ను ఇవాళ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పెట్టిన పరువు నష్టం కేసులో ప్రొబేషన్ బాండ్లను సమర్పించనందుకు కోర్టు ఆమెపై రెండు రోజుల క్రితం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ క్రమంలోనే ఇవాళ ఆమెను సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ను అరెస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసులు నిజాముద్దీన్ ని ఆమె నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లుగా సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవి కుమార్ సింగ్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande