హైదరాబాద్, 25 ఏప్రిల్ (హి.స.)
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుది రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో కేబినెట్లో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు డిజైన్ మొదలు.. నిర్మాణం, కూలిపోవడం అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిపోయిందన్నారు. రూ. లక్ష కోట్లకు ప్రజలను తాకట్టుపెట్టి కాళేశ్వరం కట్టారని, ప్రణాళిక లేకుండా నాసిరకం మెటీరియల్తో నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకోవడానికి కట్టారని మండిపడ్డారు. మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో పంటలు పండాయని, రైతులకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని మంత్రి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్