తెలంగాణ, మేడ్చల్. 25 ఏప్రిల్ (హి.స.)
మేడ్చల్ జిల్లాలోని ఔషాపూర్లో గల విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం విద్యార్థులు భారీ ఆందోళనకు దిగారు.వార్డెన్ విద్యార్థినిల వీడియోలు తీసి ఇతరులకు పంపిస్తున్నారంటూ వారు ధర్నాకు దిగారు. హాస్టల్ లో వార్డెన్ రూప విద్యార్థినుల వీడియోలు తీస్తోందని ఆరోపించారు. వార్డెన్ అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించడం గమనించిన కొందరు విద్యార్థినులు.. ఇదేమిటని ఫోన్ లాక్కొని చూడగా.. ఆ ఫోన్లో మరిన్ని వీడియోలు ఉన్న విషయం బయటికి వచ్చింది. అంతేకాదు వార్డెన్ ఆ వీడియోలను ఇతర వార్డెన్స్ కు చేరవేసిందనే విషయాన్ని గుర్తించిన విద్యార్థులు.. శుక్రవారం భారీ ధర్నాకు దిగారు.
వెంటనే వార్డెన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ వందలాది మంది విద్యార్థులు కాలేజీ ముందు ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీ వద్దకు చేరుకొని విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు