తెలంగాణ, భద్రాచలం. 8 మే (హి.స.)
భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్ర
స్వామిని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాధురి దంపతులు గురువారం దర్శించుకున్నారు. పెళ్లి రోజు సందర్భంగా ఆలయంలో స్వామివారి సుప్రభాత సేవకు హాజరయ్యారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి గోత్ర నామాలతో పూజలు చేశారు.అనంతరం మంత్రి పొంగులేటి దంపతులు ఐటీసీ గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు