కాంగ్రెస్ మాటలు విని రాష్ట్ర ప్రజలు మోసపోయారు.. కేటీఆర్
తెలంగాణ, ఖమ్మం. 9 మే (హి.స.) కాంగ్రెస్ మాటలు విని రాష్ట్ర ప్రజలు మోసపోయారని, ఐదేళ్లు దీని ఫలితం అనుభవించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజ
కేటీఆర్


తెలంగాణ, ఖమ్మం. 9 మే (హి.స.)

కాంగ్రెస్ మాటలు విని రాష్ట్ర

ప్రజలు మోసపోయారని, ఐదేళ్లు దీని ఫలితం అనుభవించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు విని రాష్ట్ర ప్రజలంతా మోసపోయారని, ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలు అమలు కోసం నిరంతరం పట్టుబడుతామని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande