సీతారామ ఎత్తు పోతల పథకం ప‌నుల‌ను పరిశీలించిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 9 మే (హి.స.) భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం యాతాలకుంటలో సీతారామ ఎత్తు పోతల పథకం ప‌నుల‌ను రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఇందులో భాగంగా యాతాలకుంట టర్నల
మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 9 మే (హి.స.)

భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం యాతాలకుంటలో సీతారామ ఎత్తు పోతల పథకం ప‌నుల‌ను రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఇందులో భాగంగా యాతాలకుంట టర్నల్ పనులను ప‌రిశీలించేందుకు సొరంగ మార్గంలోకి తుమ్మ‌ల వెళ్లారు. ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఆయ‌న‌తోపాటు స్థానిక శాసన సభ్యులు జారే ఆదినారాయణ, ఖమ్మం,భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు ముజ్మాయిల్ ఖాన్ గారు, జితిష్ , వి.పాటిల్ పాల్గొన్నారు. అనంతరం దమ్మపేట మండలం గండుగులపల్లిలో సీతారామ ఎత్తు పోతల పథకం పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప‌రిశీలించారు. ఈ వ్య‌వ‌సాయ సీజ‌న్‌కు నీరు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande