తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 9 మే (హి.స.)
హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా అందాల భామలు ఈనెల 15న పోచంపల్లికి వస్తున్న నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని టూరిజం పార్కును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులోని ప్రాంగణం, మ్యూజియం, గదులు, స్టాల్స్, సభా ప్రాంగణం వంటి ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 40 దేశాలకు చెందిన సుందరీమణులు హైదరాబాదు నుండి పోచంపల్లికి రానున్నారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు