న్యూఢిల్లీ, 8 మే (హి.స.)
నేను ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉగ్రవాద శిభిరాలపై చేసిన దాడుల వివరాలను వివరించారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశంలో చర్చించిన విషయాలను వారు మీడియాకు తెలిపారు. కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు, ఆయన ఆపరేషన్ సిందూర్ గురించి అందరికీ వివరించారు. అలాగే అందరు నాయకులు తమ సూచనలను కేంద్ర ప్రభుత్వానికి అందించారు.
దేశం కోసం అందరం కలిసి పనిచేస్తున్న సమయంలో అన్ని పార్టీల నాయకులు తమ పరిణతిని ప్రదర్శించారు. అందరూ సాయుధ దళాలను ప్రశంసించడం తో పాటు అభినందించారు. అలాగే అన్ని పార్టీల నేతలు ప్రభుత్వానికి, సాయుధ దళాలకు మద్దతు ఇస్తామని చెప్పారు. అలాగే తాజా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి వారు కొన్ని సూచనలు కూడా చేశారని వాటిని కూడా తమ పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..