ఢిల్లీ., 9 మే (హి.స.)
దేశవ్యాప్తంగా సీఏ (CA) పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్-పాక్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది. మే 9 నుంచి 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయని.. పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ఈ ప్రకటనకు సంబంధించిన సమాచారం కోసం పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులు ICAI వెబ్‌సైట్ icai.orgలో అధికారిక నోటీసును తనిఖీ చేసుకోవాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు