ముంబయి:, 9 మే (హి.స.) ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో వినియోగదారు అభివృద్ధి రుసుములు (యూడీఎఫ్) పెరగనున్నాయి. మే 16 నుంచి ఈ విమానాశ్రయం ద్వారా విదేశీ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు యూడీఎఫ్ కింద రూ.695 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణికులకు ఇది రూ.175 వరకు ఉండనుంది. యూడీఎఫ్‌ల్లో సవరణలకు విమానాశ్రయ టారిఫ్‌ల నియంత్రణ సంస్థ ఏఈఆర్‌ఏ అనుమతి ఇవ్వడంతో ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం ఈ మార్పులు చేసింది. కాగా.. 2024 ఆగస్టు వరకు దేశీయ గమ్యస్థానాల్లో ప్రయాణించే వారికి రూ.120, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.187 చొప్పున యూడీఎఫ్‌ను వసూలు చేసింది. తాజాగా 2025 మే 16 నుంచి 2029 మార్చి 31 వరకు కాలానికి (ఫోర్త్ కంట్రోల్ పీరియడ్) వర్తించేలా కొత్త టారిఫ్‌లను చత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(సీఎస్‌ఎంఐ) నిర్దేశించింది. దీని ప్రకారం..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల