భారీగా చొరబాట్లను అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం
ఢిల్లీ., 9 మే (హి.స.) జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్‌ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్‌ తిప్పికొట్టింది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకొంటున్న నేపథ్యంలో ఈ పరిణామాలు జరగడం గమనార్హం. మే 8వ తేదీ రాత్రి 1
భారీగా చొరబాట్లను అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం


ఢిల్లీ., 9 మే (హి.స.)

జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్‌ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్‌ తిప్పికొట్టింది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకొంటున్న నేపథ్యంలో ఈ పరిణామాలు జరగడం గమనార్హం. మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటుచేసుకొన్నట్లు బీఎస్ఎఫ్‌ ఎక్స్‌ పోస్టులో వెల్లడించింది. కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు బీఎస్‌ఎఫ్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు పాక్‌కు చెందిన ధన్‌బార్‌లోని పోస్టును మన దళాలు ధ్వంసం చేశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande