ప్రైవేట్ స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు.
తెలంగాణ, నల్గొండ. 13 జూన్ (హి.స.) నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ప్రైవేటు స్కూల్ బస్సుల పై శుక్రవారం రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు నడపడం, సీట్ కెపాసిటీ మించి విద్యార్థులను తరలించడం, ఇన్సూరెన్స్, మరియు డ్రైవర్ల
ప్రైవేట్ స్కూల్ బస్


తెలంగాణ, నల్గొండ. 13 జూన్ (హి.స.) నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ప్రైవేటు స్కూల్ బస్సుల పై శుక్రవారం రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు నడపడం, సీట్ కెపాసిటీ మించి విద్యార్థులను తరలించడం, ఇన్సూరెన్స్, మరియు డ్రైవర్లకు హెవీ లైసెన్సులు మొదలగు విషయాలను వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పట్టణంలో కృష్ణవేణి హై స్కూల్ కు సంబంధించిన బస్సు ఫిట్నెస్ లేకుండా నడపడంతో అధికారులు కేసు నమోదు చేశారు.

స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా, ఇన్సూరెన్స్, సీట్ కెపాసిటీ మించి విద్యార్థుల తరలిస్తే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ కొండయ్య తెలిపారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande