తెలంగాణ, సిద్దిపేట. 18 జూన్ (హి.స.)
సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హైమావతిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పోలీస్ కమిషనర్ అనురాధ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలో శాంతి భద్రతలపై ఈ సందర్భంగా కలెక్టర్ కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు