శ్రీహరికోట :8 జూన్ (హి.స. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ నెల 24న ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ) ప్రయోగం చేపట్టనున్నారు. రక్షణశాఖకు చెందిన హెలికాప్టర్ నుంచి మాడ్యూల్‌ను వదిలిపెట్టి, పారాచూట్ సాయంతో భూమికి సురక్షితంగా వచ్చేలా చూసేందుకే ఈ ప్రయోగం చేపడుతున్నారు. ఇది గగన్‌యాన్ మిషన్ భద్రత, పనితీరును నిర్ధారించడానికి సహాయపడనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు