: తిరుమల 13 జూలై (హి.స.) శ్రీనివాసుడి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సన్నిధికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు మొత్తం నిండిపోయాయి. వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ యాజమాన్యం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
అయితే, నిన్న తిరుమల శ్రీవారిని 92,221 మంది భక్తులు దర్శించుకున్నారు. 42,280 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 3.51 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ