అమరావతి, 3 జూలై (హి.స.)
,:రెండో విడత తల్లికి వందనం నగదును ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలుచేశారు. రెండో విడతలో భాగంగా ఒకటో తరగతిలో, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరిన వారికి జూలై 5న నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ