బిజెపి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రామ‌చంద్ర‌రావు ..
హైదరాబాద్, 5 జూలై (హి.స.) భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి
బిజెపి అధ్యక్షుడు


హైదరాబాద్, 5 జూలై (హి.స.)

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా ఎన్. రామచందర్‌రావు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి , ఎంపీ డీకే అరుణ , ఇతర సీనియర్‌ బీజేపీ నేతలు హాజరయ్యారు.ముందుగా తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరిన రామచందర్‌రావు ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతీ దేవాలయంలో, అనంతరం చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. రామచందర్‌రావు నాయకత్వంలో తెలంగాణ బీజేపీ మరింత బలోపేతం కానుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande