అమరావతి, 5 జూలై (హి.స.)ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Former Minister Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ మంత్రి రోజా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. టీడీపీ(TDP), జనసేన నేతలకు(Janasena Leaders) ఎంత మగ అహంకారం అని వైసీపీ నేత రోజా మండిపడ్డారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్(Deputy CM pawan Kalyan), ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ(MLA Balakrishna) ఎన్ని రోజులు అసెంబ్లీ(AP Assembly)కి వెళ్లారు? అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారిద్దరు ఎన్ని సమస్యలపై పోరాడారు. ఎంతమంది సమస్యలు తీర్చారో చెప్పాలి అని రోజా వ్యాఖ్యానించారు. నేను మంత్రిగా ఏం చేశానో చెప్తా. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సిద్ధమా? అని ఆమె ప్రశ్నించారు. నేను జబర్దస్త్ చేస్తే తప్పు అయినప్పుడు వాళ్ళు షూటింగులు ఎలా చేస్తారు? అని మాజీ మంత్రి రోజా నిలదీశారు. గతంలో నన్ను అన్నప్పుడు.. ఇప్పుడు వారు ఎలా చేస్తారు. నేను చేస్తే తప్పు అయినప్పుడు వాళ్ళు చేస్తే తప్పు కాదా? అని ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. షూటింగులు చేసుకోవడానికి ప్రజలు మీకు ఓట్లు వేశారా? అని పవన్ కల్యాణ్, బాలకృష్ణ పై ఇంటర్వ్యూలో మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి