అమరావతి, 8 జూలై (హి.స.)ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీ పర్యటన(Delhi Tour)కు వెళ్లనున్నారు. ఈనెల 14-16 వరకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 14న సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్ళి, మూడు రోజుల పాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah), జలశక్తి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya)తో సమావేశం కానున్నట్టు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి