శ్రీశైలం, 8 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) ఈ రోజు మంగళవారం రోజున శ్రీశైలం (Srisailam)లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందగా.. సీఎం పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉండవల్లి (Undavalli) నివాసంలో ఉన్న సీఎం చంద్రబాబు కుటుంబం రేపు.. ఉదయం 10 గంటలకు బయలుదేరి నేరుగా.. 11 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. అనంతరం వారు మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం.. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు సీఎం చంద్రబాబు చేరుకొని.. నిండుకుండలా మారిన జలాశయాన్ని సందర్శిస్తారు. అలాగే జల హారతి (Jala Harati) కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవ్వనున్నారు. అలాగే డ్యామ్ పరిస్థితులపై అధికారులతో చర్చించి.. మధ్యాహ్నం 2:30 గంటలకు అమరావతి చేరుకోనున్నట్లు తెలుస్తుంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే శ్రీశైలం పరిసర ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి